హీరో విజయ్ దేవరకొండపై పోలీస్టేషన్లో ఫిర్యాదు
గిరిజనులను అవ మానించేలా హీరో విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు చేశారంటూ గిరిజనుల న్యాయవాదులు సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సంఘం చైర్మన్ కిషన్ రాజ్ చౌహాన్ గురువారం ఎస్ఆర్ నగర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 26వ తేదీన మాటీవీ ప్రీ రిలీజ్ రెట్రో మూవీ ఈవెంట్ లో హీరో విజయ్ దేవరకొండ పాకిస్థాన్ తీవ్రవాదుల గురించి మాట్లాడుతూ.. 500 ఏళ్ల క్రితం గిరిజనుల కొట్టుకున్నట్లు బుద్ధి లేకుండా, కనీస కామన్సెన్స్ లేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గిరిజనులను కించపరి చేలా మాట్లాడిన హీరో దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి తెలిపారు.


