నటి నయనతార దంపతులపై ఫిర్యాదు
నటి నయనతార సరోగసీ విధానంలో పిల్లలకు జన్మనివ్వడం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం సృష్టిస్తోంది. దీంతో నయనతార దంపతులు చిక్కల్లో పడినట్లు తెలుస్తోంది. సరోగసీ విధానంలో పిల్లలకు జన్మనిచ్చినందుకుగాను నయనతార దంపతులపై అనేక ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా పరిగణించింది. సరోగసీ విధానంలో పిల్లలను కనడంపై ప్రభుత్వానికి వివరణ ఇవ్వాలని ఇప్పటికే వారిని ఆదేశించింది. ఇది ఇలా ఉండగా తాజాగా ఓ అడ్వొకేట్ నయనతార దంపతులపై ఫిర్యాదును లేవనెత్తారు. సరోగసీ పద్దతిలో పిల్లలను కనడంపై చెన్నై కమిషనర్‌కు అడ్వొకేట్ ఫిర్యాదు చేశారు. దీనిలో నయనతార, భర్త విఘ్నేష్, అద్దె తల్లి,వైద్యులపై చర్యలు తీసుకోవాలని అడ్వొకేట్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా సరోగసీ విధానంలో పిల్లలను కనడంపై ప్రముఖలు నయనతార దంపతులపై మండిపడుతున్నారు.

