హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ కీలక వ్యాఖ్యలు
హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూల్చివేతల విషయంలో హైడ్రా ఎలాంటి యూ టర్న్, బ్యాక్ టర్న్ తీసుకోలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలసీ ప్రకారమే తమ సంస్థ కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. 2024 జూలైకి ముందు పర్మిషన్లు ఉన్న ఇళ్లను కూల్చబోమని స్పష్టం చేశారు. ఒక వేళ ప్రభుత్వం అన్ని ఇళ్లను కూల్చదలుచుకుంటే లక్షలాది ఇళ్లను తాము కూల్చాల్సి ఉంటుందన్నారు. హైడ్రా ఏర్పాటైన తర్వాత అనుభవాలతో కొన్ని పాలసీలను మార్చుకున్నామని తెలిపారు.