విజయ్ సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
సీఐడి విచారణకు హాజరైన మాజీ ఎంపి విజయసాయిరెడ్డి…విచారణ అనంతరం పలు సంచలన విషయాలు మీడియా ముందు వెల్లడించారు.
✅కేవి రావుకి, మీకు సంబంధం ఏంటని సీఐడి ప్రశ్నించింది.నాకు అతనితో సంబంధం లేదని చెప్పా.నాకు కేవిరావు అంటే ఎక్కడా లేని అసహ్యం
✅టిటిడి మాజీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఎప్పుడు అమెరికా వెళ్లినా కేవిరావు ఇంట్లోనే ఉంటాడు
✅లిక్కర్ స్కామ్ ప్రధాన సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డే అని సీఐడికి చెప్పాను.
✅జగన్మోహన్‌రెడ్డి నన్ను పార్టీలో ఉండమన్నాడు.కానీ కోటరీ పద్దతి నచ్చక నేను పార్టీని వీడాను.జగన్ ని తప్పుదోవ పట్టించేవారు ఎక్కువగా ఉన్నారు.అలాంటి వారి మధ్య ఉండలేకపోయాను
✅కోటరీ మాటలు వినొద్దని జగన్‌కి నేరుగా చెప్పా.
✅నా మనసు విరిగిపోయింది.అందుకే వైసీపిని వీడాను.ఒకసారి విరిగిన మనసు మళ్లీ అతుక్కోదు.నేను వైసీపి ఘర్ వాపసీ చేయను.
✅కోటరీ నుంచి బయటపడితేనే జగన్‌కి భవిష్యత్తు ఉంటుంది.
✅జగన్ కి నాకు మధ్య విభేదాలు సృష్టించారు.వాళ్ల ఎదుగుదల కోసం నన్ను కిందకు లాగారు.
✅భయం అనేది నా రక్తం లోనే లేదు. సీఐడి ఎప్పుడు పిలిచినా వస్తా.మరికొన్ని విషయాలు మళ్ళీ చెప్తా.

