NationalNews

డ్రగ్స్‌ ఉచ్చులో కమెడియన్‌ భారతి సింగ్‌

2020 డ్రగ్స్‌ కేసులో కమెడియన్‌ భారతి సింగ్‌, ఆమె భర్త హర్ష్‌ లింబాచియా, డ్రగ్‌ పెడ్లర్‌ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) చార్జిషీట్‌ దాఖలు చేసింది. సుమారు 1200 పేజీలతో కూడిన ఈ చార్జిషీట్‌ను ఎన్సీబీ ఇటీవల కోర్టులో సమర్పించింది. అంధేరీ సబర్బన్‌లోని వారి నివాసంలో గంజాయి స్వాధీనం చేసుకున్న తరువాత 2020 నవంబర్ లో ఈ జంటను యాంటీ డ్రగ్‌ ఏజెన్సీ అరెస్ట్‌ చేసింది. నిందితులిద్దరిపై (ఎన్డీపీఎస్‌) చట్టంలోని సెక్షన్‌ 8(సి) (మాదక ద్రవ్యాలు కలిగి ఉండటం), 27 (మాదక ద్రవ్యాల వినియోగం) సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిషేధిత మాదక ద్రవ్యాల సరఫరాలో కీలక పాత్ర పోషించిన మరో వ్యక్తిని ఎన్సీబీ బృందం అరెస్టు చేసిందని తెలిపారు. అందుకు అనుగుణంగానే ఎన్సీబీ బృందం ఈ కేసును దర్యాప్తు చేసి కొన్ని వారాల క్రితం చార్జిషీట్‌ దాఖలు చేసిందని తెలిపారు.