Home Page SliderTelangana

వస్తా మీ వెనకా.. ఎటైనా మన మంచికే..

ఈటల రాజేందర్ హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సతీమణి జమున ప్రతీసారీ భర్తకు సపోర్ట్‌గా ఎన్నికల సందర్భంగా డమ్మీ నామినేషన్ వేయడం ఆనవాయితీ చేసుకున్నారు. గతంలో ఇలా ఏడుసార్లు వేశారు. ఇప్పుడు కూడా డమ్మీ నామినేషన్ వేశారు. ముందుచూపుతో ఈ తంతు అలవాటు చేసుకున్న జమున గారు. ఒకప్పుడు నాయకుడు తమకు నమ్మకస్తులైన అనుచరులతో డమ్మీ నామినేషన్ వేయించేవారు. అంతా సజావుగా జరిగింది అనుకుంటే వీరు (డమ్మీ) నామినేషన్ ఉపసంహరించుకుంటారు.