ఉమ్మడి ఖమ్మం జిల్లా
ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క మరోసారి గెలిచారు. ఇది 4వ సారి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి భట్టి భారీ మెజార్టీతో గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌పై 35,452 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌పై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు భారీ మెజార్టీతో గెలిచారు. తుమ్మలకు 49,381 ఓట్ల మెజార్టీ లభించింది.
ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో మెజార్టీ పొందడంతో హస్తం గాలి వీచింది. పొత్తులో భాగంగా కొత్తగూడెం నుండి పోటీచేసిన సీపీఐ అభ్యర్థి కూడా భారీ మెజార్టీతో గెలుపొందారు. ఉమ్మడి జిల్లాలోని పాలేరు, ఖమ్మం, మధిర, వైరా, సత్తుపల్లి, ఇల్లెందు, అశ్వారావుపేట, పినపాక నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో ముందుకు సాగింది. కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు గెలుపొందారు.