Home Page SliderTelangana

మంచు ఫ్యామిలీలో ఢిష్యుం.. ఢిష్యుం…

మంచు మోహన్ బాబు తనయులు విష్ణు, మనోజ్ మధ్య పంచాయితీ సోషల్ మీడియా వేదికగా బహిర్గతమయ్యింది. ఇప్పటి వరకు కుటుంబంలో ఉన్న విభేదాలు నడిరోడ్డుపైకి వచ్చాయి. సోదరుడు మంచు విష్ణు తమ బంధువుల ఇళ్లకు వచ్చి రౌడీయిజం చేస్తున్నాడంటూ సాక్షాత్తూ సోదరుడు మంచు మనోజ్ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయడంతో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మంచు కుటుంబానికి సన్నిహితంగా ఉంటూ వచ్చిన సారధి అనే వ్యక్తి విషయంలో పంచాయితీ మొదలైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సారధి మంచు మనోజ్ దగ్గర పనిచేస్తున్నాడు. సారధి ఇంటికి వెళ్లి.. కొట్టబోయాడంటూ మనోజ్ ఆరోపించాడు. మంచు విష్ణుపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని సారధి భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే మొత్తం వ్యవహారంపై ఉల్టాగా తనే కేసు పెట్టే యోచనలో విష్ణు ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం వ్యవహారం చినికిచినికి గాలివానలా మారుతోండటంతో.. మోహన్ బాబు రంగ ప్రవేశం చేసినట్టు తెలుస్తోంది. తనదైన స్టైల్లో మనోజ్‌కు, మోహన్ బాబు వార్నింగ్ ఇవ్వడంతో ఫేస్ బుక్‌లో పెట్టిన మొత్తం వీడియోను మంచు మనోజ్ డిలీట్ చేశాడు.