home page sliderHome Page SliderTelangana

ప్రభుత్వాసుపత్రిలో కలెక్టర్ భార్య ప్రసవం..

ఆయనొక జిల్లా కలెక్టర్, ఉన్నత ఉద్యోగి అయి ఉండి కూడా ఏ కార్పోరేట్ హాస్పిటల్ కు వెళ్లకుండా సాదాసీదా ప్రజలు వెళ్లే ప్రభుత్వ ఆస్పత్రిలో తన సతీమణి కాన్పు చేయించారు. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సతీమణి శ్రద్ధ జితేష్ వి పాటిల్ పాల్వంచ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రిలో వైద్యులు ప్రసవం చేశారు. ఈ కాన్పులో ఆమె మగ బిడ్డకి జన్మనిచ్చారు. తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. గత కొన్ని నెలలుగా పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలోనే పరీక్షలు చేయించుకుంటున్నారు. కలెక్టర్ భార్య ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పు చేయించుకోవడంతో సామాన్య ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై, సర్కారు వైద్యంపై నమ్మకం ఏర్పడుతుంది. కలెక్టర్ స్థాయిలో ఉండి కూడా ప్రభుత్వ ఆస్పత్రిలో తన సతీమణికి కాన్పు చేయించడంతో ప్రజలు కలెక్టర్ జితేష్ వి పాటిల్ ను ప్రశంసిస్తూ, ప్రజలందరికీ ఆయన ఆదర్శంగా నిలిచారని పలువురు అభిప్రాయపడుతున్నారు.