పార్వతీపురం గవర్నమెంట్ హాస్పిటల్‌లో కలెక్టర్ భార్య ప్రసవం
ఏపీ: పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ భార్య కరుణ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో బుధవారం సాయంత్రం మగబిడ్డకు జన్మనిచ్చారు. మొదటి కాన్పు రంపచోడవరం ప్రభుత్వాసుపత్రిలో జరిగింది. రెండవ కాన్పు పార్వతీపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేయించుకున్నారు. అంత పెద్ద అధికారి అయి ఉండి ప్రభుత్వాసుపత్రిని ఆశ్రయించడంతో అందరూ ప్రశంసిస్తున్నారు.