Home Page SliderTelangana

ఆర్టీసీ బస్టాండ్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆర్టీసీ బస్టాండ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మహిళలకు ప్రభుత్వం కల్పించిన ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అమలు తీరును అధికారులతో కలిసి పరిశీలించారు. పలువురు మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి బస్సులను నడిపేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. వారి వెంట ఆర్టీసీ డిప్యూటీ రీజినల్ మేనేజర్ ప్రణీత్, డిపో మేనేజర్ కల్పన, ఆర్టీసీ అధికారులు ఉన్నారు.