కూలిన ఎల్బీ స్టేడియం గోడ..పలు వాహనాలు ధ్వంసం
భారీ ఎడతెరిపిలేని వర్షాల కారణంగా హైదరాబాద్ అతలాకుతలమవుతోంది. తాజాగా ఎల్బీ స్టేడియం ప్రహారీ గోడ భారీ వర్షాలకు కూలిపోయింది. దీనితో అక్కడ పార్క్ చేసిన పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. సమాచారం తెలియడంతో అధికారులు అక్కడకు చేరి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా పరిధిలో పాఠశాలలకు, కాలేజీలకు భారీ వర్షాల కారణంగా సెలవు ప్రకటించారు. పరిస్థితిని బట్టి సమీక్షించి ఇతర జిల్లాలలో కూడా పాఠశాలలకు సెలవు ఇవ్వాలని విద్యాశాఖ ఆదేశించింది. రోడ్లపై చాలా చోట్ల మోకాలు లోతు నీరు చేరింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పలు చోట్ల డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.