కుప్పకూలిన స్టేజీ.. కాంగ్రెస్ నేతకి గాయాలు
ఓ బట్టల షాపు ఓపెనింగ్ లో అపశృతి చోటు చేసుకుంది. ఓపెనింగ్ కోసం ఏర్పాటు చేసిన స్టేజీ కుప్పకూలడంతో పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి అనుమాండ్ల ఝాన్సీ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఆమెకు స్థానికంగా ప్రాథమిక చికిత్సలు చేయించి.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో తొర్రూరులో చోటు చేసుకుంది. ఝాన్సీ రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తుండగా ఒక్కసారిగా వేదిక కుప్పకూలింది. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి ఝాన్సీ రెడ్డి అత్త. ప్రస్తుతం ఆమె పాలకుర్తి కాంగ్రెస్ ఇన్ చార్జి వ్యవహరిస్తున్నారు.