కుప్పకూలిన హెలికాప్టర్.. పైలట్ తో సహా నలుగురికి సీరియస్
మహారాష్ట్రలోని పుణేలో ప్రైవేట్ సంస్థకు చెందిన హెలికాప్టర్ కుప్పకూలింది. వాతావరణం అనుకూలించకపోవడంతో పౌడీ గ్రామంలోని పొలాల్లో హెలికాప్టర్ ను ల్యాండ్ చేసేందుకు పైలట్ ప్రయత్నించినప్పుడు ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ చెట్టును ఢీకొని పొలాల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ తో సహా 4గురికి తీవ్రగాయాలయ్యాయని స్థానిక పోలీసులు చెబుతున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా ముగ్గురికి ఐసీయూలో ట్రీట్ మెంట్ కొనసాగుతోంది. హెలికాప్టర్ ముంబై నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ హెలికాప్టర్ గ్లోబల్ వెక్ట్రా కంపెనీకి చెందింది.

