Andhra PradeshHome Page Slider

విశాఖ రైల్వే స్టేషన్‌లో కూలిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి

ఏపీ: విశాఖ రైల్వే స్టేషన్‌లో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూలిపోయింది. బ్రిడ్జి కూలి రైల్వే ట్రాక్‌పై పడటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని, సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం వస్తోంది. అయితే ట్రాక్‌పై పడిన బ్రిడ్జిని అధికారులు తొలగించే పనులు చేపట్టారు.