ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన బ్రిడ్జ్- సరిహద్దు గ్రామాలకు కనెక్షన్ బంద్
ఉత్తరాదిని కుదిపేస్తున్న వరదల కారణంగా ఇండో టిబెట్ బోర్డర్‌లోని జుమ్మగద్ నదిపై ఉన్న బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. ఛమోలి జిల్లాలోని ఈ బ్రిడ్జ్‌పై నుండి ఇండియా టిబెట్ మధ్యగల రోడ్డు ఉండడంతో ఆ దారి మూసుకుపోయినట్లయ్యింది. దీనితో దాదాపు 12కు పైగా గ్రామాలకు రాకపోకలు బందయ్యాయి. జుమ్మగద్ నది వరద కారణంగా పొంగి పొరలుతోంది. జుమ్మా గ్రామానికి దగ్గరలో గల జోషిమఠ్-నీతి హైవే పై గల నది వరద పోటెత్తింది. దీనితో ఒక్కసారిగా ఈ వంతెన కూలిపోయింది. దీనితో కాగా,గర్పక్, ద్రోణగిరి, జెల్లుమ్, కోస, మలరి,మహర్గాన్, కైలాస్‌పుర్, ప్రకియ,బంప, గంశాలి, నీతి గ్రామాలు అన్నీ జుమ్మ గ్రామానికి అవతలి వైపున ఉన్న గ్రామాలు. ఈ వంతెన కూలిపోవడంతో ఈ గ్రామాలతో కనెక్షన్ తెగిపోయింది. దీనితో వరద ప్రాంతాలకు ఆహార సరఫరా కూడా ఈ సరిహద్దు ప్రాంతాలలో నిలిచిపోయింది. వరద నీరు భారీగా జోషిమఠ్- మలరి రోడ్‌లో నిలిచిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు.

