టీనేజ్‌లో సహజీవనం..యూట్యూబ్ చూసి ప్రసవం
తమిళనాడులోని ఈరోడ్ జిల్లా అవినాశి అనే ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన యువకుడు కాలేజీ చదువుతున్న ఒక టీనేజ్ అమ్మాయిని ప్రేమించాడు. అంతేకాక భయంతో ప్రెగ్నెంట్ అయిన అమ్మాయి ప్రాణాలతో చెలగాటం ఆడాడు. యూట్యూబ్‌లో చూసి ఆమెకు డెలివరీ చేశాడు. ఈ ఘటన అక్కడ సంచలనం రేపింది. చదువుకుంటున్న వీరిద్దరూ అమ్మాయి ఇంట్లో వారికి చెప్పకుండా భార్యాభర్తలుగా నటిస్తూ ఒక ఇల్లు అద్దెకు తీసుకుని, సహజీవనం చేస్తున్నారు. ఆమెకు గర్భం వచ్చినా కూడా ఈ విషయం పెద్దలకు చెప్పలేదు. అయితే యూట్యూబ్ చూసి ప్రసవం చేసిన తర్వాత ఆమెకు తీవ్ర రక్తస్రావం జరగడంతో కోయంబత్తూర్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు ప్రసవం జరిగినట్లు గుర్తించిన వైద్యులు అతడిని నిలదీసి, ఇంటికి వెళ్లి బిడ్డను స్వాధీనం చేసుకుని తల్లిదండ్రులకు తెలియజేశారు. యువకుని తల్లి వారితో కలిసి ఉంటున్నట్లు సమాచారం.