Home Page SliderTelangana

కొబ్బరికాయల వాహనం బోల్తా.. సంచుల్లో ఎత్తుకెళ్లిన స్థానికులు

వరంగల్ జిల్లా వర్ధన్నపేట వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొబ్బరికాయలతో వెళ్తున్న బొలేరోను లారీ ఢీకొనడంతో బోల్తా పడింది. అయితే.. ఈ ఘటనలో కొబ్బరికాయలు కింద పడటంతో సమీపంలోని తండా వాసులు, స్థానికులు తరలివచ్చి వాటిని సంచుల్లో నింపేసి ఎత్తుకెళ్లారు.