Andhra PradeshBusinessHome Page SliderPolitics

సీఎం మహిళాదినోత్సవ కానుక

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీలో మహిళలకు సీఎం చంద్రబాబు సరికొత్త పథకం ప్రారంభించనున్నారు. మార్చి 8న  రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాలలో ఆసక్తి గల డ్వాక్రా మహిళలకు 1000 ఈ- బైక్‌లు, ఆటోలను అందించనున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో స్వయంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా పలువురు రైడర్లకు వాహనాలు పంపిణీ చేయబోతున్నారు. ఈ వాహనాలను అద్దెకు నడపడానికి ఇప్పటికే ప్రముఖ రైడ్ సంస్థ ర్యాపిడోతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభ దశలో విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో అమలు చేయనున్నారు. ఒక్కో నగరానికి 400 వాహనాలు కేటాయించగా, మరో 200 వాహనాలను కాకినాడ, రాజమహేంద్రవరం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు నగరాల్లో అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది.