Breaking NewsHome Page SliderNationalPolitics

ఢిల్లీ స్కూల్స్‌కు సీఎం వార్నింగ్..

ఢిల్లీలోని పాఠశాలల యాజమాన్యాలకు ముఖ్యమంత్రి రేఖా గుప్తా సీరియస్‌గా హెచ్చరికలు జారీ చేశారు. చట్టవిరుద్ధంగా ఫీజులు పెంచితే స్కూల్స్ మూతబడతాయని, అలాంటి పాఠశాలల గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రతీఏటా పెరిగే స్కూల్ ఫీజుల భారంతో ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులకు ఇది గుడ్ న్యూసే. పాఠశాల ఫీజుల నియంత్రణ ముసాయిదా బిల్లును నేడు మంత్రి మండలి ఆమోదించింది. 1677 ప్రభుత్వ గుర్తింపు గల పాఠశాలలపై ఫీజు నియంత్రణ చర్యలు తీసుకోనున్నారు. దీనితో అలాంటి చట్టం మా రాష్ట్రంలో కూడా రావాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.