ఆ పార్టీలపై సీఎం సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఖర్చును బీజేపీ భరిస్తోందని ఢిల్లీ సీఎం అతిషీ సంచలన ఆరోపణ చేశారు. ఆమ్ ఆద్మీని దేశ వ్యతిరేక పార్టీగా భావిస్తే ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎందుకు కలిసి పోటీ చేశారని ఆమె ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నాయకులు లోపాయికారి ఒప్పందం చేసుకుని ఢిల్లీలో ఆప్ పార్టీని ఓడించాలని చూస్తున్నారని సీఎం అతిషీ మండిపడ్డారు.