ఉద్యోగులకు సీఎం కీలక ఆదేశాలు..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆపరేషన్ సింధూర్ నేపధ్యంలో అత్యవసర సేవల విభాగాల ఉద్యోగుల సెలవులను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో రాజకీయాలకు తావు లేదన్నారు. ఉద్యోగులు, మంత్రులు, అధికారులు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. విదేశీ పర్యటనలు రద్దు చేశారు. ఉద్యోగులెవరూ సోషల్ మీడియాలలో అనవసర ప్రసంగాలు, పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. భారత సైన్యానికి సంఘీభావంగా మనమంతా ఉన్నామనే సందేశంతో సాయంత్రం సెక్రటేరియట్ నుండి నెక్లెస్ రోడ్ వరకూ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ఈ ర్యాలీలో సీఎం, ఇతర మంత్రులు పాల్గొంటారు.


 
							 
							