మెగాస్టార్‌కు సీఎం బర్త్‌డే విష్..
మెగాస్టార్ చిరంజీవికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బర్త్‌డే విషెస్ చెప్పారు. అద్భుతమైన పాత్రలు పోషించిన చిరంజీవి వెండితెర ఆణిముత్యమని కొనియాడారు. స్వయంకృషితో ఎన్నో విజయాలను అందుకున్నారన్నారు. తరాలు మారుతున్నకొద్దీ ప్రేక్షకుల అభిమానాన్ని పెంచుకుంటూ పోతున్నారని పేర్కొన్నారు. చిరంజీవి స్థాపించిన ఐబ్యాంక్, బ్లడ్ బ్యాంకులు మానవత్వానికి నిదర్శనాలుగా నిలిచాయని మెచ్చుకున్నారు. ఆయన తన పేరును సార్థకం చేసుకుంటూ మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. భగవంతుని దయవల్ల ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు లభించాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు.

