Home Page SliderTelangana

సీఎం పుట్టిన రోజున కూడా అరెస్ట్ లు ఆపరా?

కనీసం పుట్టిన రోజునాడైనా నిర్బంధాలు, అక్రమ అరెస్టులు లేకుండా పాలన కొనసాగించాలని మాజీ మంత్రి హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డికి ఉద్దేశించి అన్నారు. సీఎం మూసీ పాదయాత్ర సందర్భంగా బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టులపై ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి మూసీ పాదయాత్ర సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అక్రమ అరెస్టులు, నిర్బంధాన్ని తీవ్రంగా ఖండించారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను హౌస్ అరెస్టులు చేసినంత మాత్రాన మీ పాదయాత్రకు ప్రజల మద్దతు లభిస్తుందా? అని ప్రశ్నించారు. పాదయాత్ర కాదు, పాప పరిహారయాత్ర చేసినా కాంగ్రెస్ పార్టీ పాపం పోదని, పేదల గూడు కూల్చింది ఒక దగ్గర, పాదయాత్ర మరొక దగ్గర అని మండిపడ్డారు. దమ్ముంటే.. హైదరాబాద్ నుంచి పాదయాత్ర మొదలు పెట్టాలని సవాల్ విసిరారు.