Home Page SliderTelangana

కొత్త రేషన్ కార్డులపై సీఎం కీలక ప్రకటన

తెలంగాణ ప్రజలు కొత్త రేషన్ కార్డులు ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. అనేక సంక్షేమ పథకాలకు రేషన్ కార్డును లింక్ చేసిన క్రమంలో చాలా మంది కార్డుల కోసం ప్రజలు వేచి చూస్తున్నారు. ఎట్టకేలకు ఆ గడియ రానే వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు ప్రజా పాలన కార్యక్రమం చేపట్టనుంది. ఇందులో భాగంగా రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల కోసం అధికారులు వివరాలు సేకరించనున్నారు. పూర్తి హెల్త్ ప్రొఫైల్తో రాష్ట్రంలో ప్రజలందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని, ఇందుకోసం క్షేత్రస్థాయి అధికారులు సన్నద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.