Home Page SliderNational

తమిళనాడులో కూడా “సీఎం వర్సెస్ గవర్నర్”

తమిళనాడులో కూడా తెలంగాణాలో నెలకొన్న పరిస్థితులే కనపడుతున్నాయి. గవర్నర్‌కు రాష్ట్రప్రభుత్వానికి పొసగడం లేదు. శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ రవి పాస్ చేయడం లేదని మండిపడుతున్నారు సీఎం స్టాలిన్. రాష్ట్ర సంక్షేమానికి గవర్నర్ అడ్డు పడుతున్నారని విమర్శిస్తున్నారు. సీఎం స్టాలిన్ అసెంబ్లీలో మాట్లాడుతూ గవర్నర్ రాష్ట్రప్రభుత్వానికి మార్గదర్శకంగా ఉండాలని, ప్రభుత్వంపై పెత్తనం చేయకూడదని పేర్కొన్నారు. కానీ రాష్ట్రగవర్నర్ ఏమాత్రం ప్రభుత్వానికి సహకరించడం లేదని, గవర్నర్‌పై రాష్ట్రపతి ద్రౌపదిముర్ము తగిన చర్యలు తీసుకోవాలని ఆంకాంక్షించారు.