Home Page Sliderhome page sliderTelangana

నాంపల్లి కోర్టుకు సీఎం

తెలంగాణలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని గతంలో రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి నాంపల్లి మనోరంజన్ కోర్టుకు హాజరయ్యారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి రెండోసారి కోర్టుకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బేగం బజార్, నల్గొండ, మెదక్ పోలీస్ స్టేషన్లలో కేసు నమోదైంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణకు హాజరయ్యారు. నల్గొండ టూ టౌన్ పీఎస్, బేగంబజార్ పీఎస్, మెదక్ జిల్లా కౌడిపల్లి పీఎస్ పరిధిలో నమోదైన మూడు కేసుల్లో వ్యక్తిగతంగా జడ్జి ముందు హాజరయ్యారు. ఈ కేసులు నమోదైన సమయంలో ఆయన పీసీసీ చీఫ్ గా ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని కోర్టుకు తెలిపారు. పోలీసులు చెప్తున్నవి అన్నీ కూడా అవాస్తవాలు. తాను ఎక్కడ ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ కోర్టు రికార్డ్ చేసుకుంది. జూన్ 12వ తేదీన నాంపల్లి స్పెషల్ కోర్టు ఈ కేసులో తీర్పు ప్రకటించనుంది.