జైల్లో దర్శన్ జల్సాలపై సీఎం సిద్దరామయ్య ఆదేశం
కన్నడ నటుడు దర్శన్ పరప్పన అగ్రహారం జైల్లో కస్టడీలో ఉన్నప్పుడు స్పెషల్ ట్రీట్మెంట్, జల్సాల వివాదంపై సీఎం సిద్దరామయ్య స్పందించారు. వెంటనే దర్శన్‌ను ఆ జైలు నుండి వేరే జైలుకు తరలించాలని ఆదేశించారు. ఈ ఘటనలో వైరల్ ఫోటో, వీడియోపై దర్యాప్తు తర్వాత ఏడుగురు బెంగళూరు జైలు అధికారులను సస్పెండ్ చేశారు. ప్రాథమిక విచారణ ఆధారంగా, ఏడుగురు అధికారుల ప్రమేయం ఉందని గుర్తించారు. వారిని సస్పెండ్ చేశారు. ఇది తీవ్రమైన భద్రతా లోపం” అని కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర్ అన్నారు. దర్శన్ కుర్చీలో కూర్చొని, సిగరెట్, కాఫీ కప్పును పట్టుకుని, మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి మాట్లాడుతున్న వీడియో బయటకు వచ్చింది. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని మృతుడు రేణుకాస్వామి తండ్రి కాశీనాథ్ ఎస్ శివనాగౌడ్రు డిమాండ్ చేశారు. ‘అతడు జైలులో ఉన్నాడా?.. రిసార్టులో ఉన్నాడా’? అని ఆశ్చర్యంగా ఉందన్నాడు. ఈ విషయంపై బీజేపీ పార్టీ సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.

