Andhra PradeshHome Page Slider

సీఎం జగన్ కీలక ఆదేశాలు

ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీచేశారు. కాగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ వర్కర్లు,హెల్పర్ పోస్టులను భర్తీ చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వీటితోపాటు మహిళా శిశుసంక్షేమశాఖలో ఖాళీ పోస్టులను కూడా భర్తీ చేయాలని తాజాగా జరిగిన సమీక్షలో సీఎం వెల్లడించారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించే పరికరాలను అందుబాటులో ఉంచాలన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పనులు జరుగుతున్న 10 వేలకు పైగా అంగన్‌వాడీ కేంద్రాలతో  పాటు మిగతా వాటిల్లోనూ ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.