ఇరిగేషన్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ సమీక్ష
హైదరాబాద్: రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల భద్రతపై కేంద్రమంత్రి సీ.ఆర్. పాటిల్ రాసిన లేఖపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులుతో చర్చించారు.
ప్రాజెక్టుల భద్రతకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై సూచనలు చేస్తూ, లేఖలో పేర్కొన్న వాటితో పాటు అన్ని డ్యామ్‌లపై నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.సీఎం సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల రిపేర్లను వెంటనే ప్రారంభించాలని, వాటి బాధ్యత సంబంధిత ఏజెన్సీలే వహించేలా చూడాలని స్పష్టం చేశారు.
ఇరిగేషన్ విభాగం పనితీరుపై నవంబర్ రెండో వారంలో మళ్లీ సమీక్ష నిర్వహిస్తానని సీఎం తెలిపారు.

