అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణాలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి సభలో వాడీ-వేడీగా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో విద్యుత్ రంగానికి చెందిన 3 అంశాలపై పూర్తి స్థాయిలో జ్యుడీషియల్ విచారణకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ మేరకు త్వరలోనే తెలంగాణా విద్యుత్ శాఖలో జరిగిన స్కాంలపై విచారణ చేయిస్తామన్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వం ఛత్తీస్‌ఘడ్‌తో చేసుకున్న ఒప్పందాలపై కూడా విచారణ జరిపిస్తామన్నారు. అయితే ఈ ఒప్పందాలను వద్దు అని చెప్పిన అధికారికి పనికిరాని పోస్టింగ్ ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికంగా గత ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్‌లో వేల కోట్ల అవినీతి జరిగిందని సీఎం ఆరోపించారు. కాగా భద్రాద్రి ప్రాజెక్ట్‌లో కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని వాడారన్నారు. అప్పుడు మేము ఆ టెక్నాలజీని వాడొద్దని బీఆర్ఎస్ ప్రభుత్వంతో వారించినప్పటికీ పట్టించుకోకుండా దానిపై రూ.10 వేల కోట్లు వెచ్చించి తెలంగాణాను ముంచేశారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు భద్రాద్రి ప్రాజెక్ట్‌పై న్యాయవిచారణకు ఆదేశిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

