కుమారి ఆంటీ క్యాంటీన్ తిరిగి తెరిపించిన రేవంత్, త్వరలో తాను సందర్శిస్తానన్న సీఎం
మాదాపూర్‌లో ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యంలో… మంగళవారం పోలీసులు తన వ్యాపారాన్ని మూసివేసిన ఒక రోజు తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై స్పందించారు. ఇంటర్నెట్‌లో సంచలనం మారిన రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ యజమాని కుమారి ఆంటీకి సీఎం రేవంత్ ఊరటనిచ్చారు. కుమారి ఆంటీ ITC కోహినూర్ జంక్షన్ సమీపంలో రోడ్డు పక్కన క్యాంటీన్ పెట్టుకున్నారు. సమీపంలోని సాఫ్ట్‌వేర్ కంపెనీలకు చెందిన టెక్కీలతో సహా చాలా మంది నిత్యం ఇక్కడ భోంచేస్తారు.

క్యాంటీన్ కు మధ్యాహ్నం హెవీ రష్ ఉండటం వల్ల ఇక్కడ ఐటీ కారిడార్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై తరచుగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. ఈ ట్రాఫిక్ జామ్‌ల కారణంగా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌ను మూసేయించాలని పోలీసులు భావించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేని ప్రాంతంలో క్యాంటీన్ పెట్టుకోవాలని పోలీసులు కుమారి ఆంటీ సూచించారు. కుమారి ఆంటీ వ్యాపారాన్ని మూసివేసిన అంశం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టిని ఆకర్షించింది.

పోలీసులు తక్షణం క్యాంటీన్ తొలగింపు ఆలోచనను మానుకోవాలని ఆయన కోరారు. ఆమె వ్యాపారాన్ని కొనసాగించడానికి అనుమతించాలని రాష్ట్ర పోలీసు చీఫ్ (డిజిపి), మున్సిపల్ శాఖను ఆదేశించారు. త్వరలో ప్రముఖ ఫుడ్ స్టాల్‌ను కూడా సందర్శిస్తానని చెప్పారు. కుమారి ఆంటీ తన ‘టూ లివర్స్ ఎక్స్‌ట్రా..’ వీడియో కోసం సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది.