కేసీఆర్‌కు తనకు తేడా చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ విధానానికి తనకు చాలా తేడా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర అవతరణ వేడుకలకు కనీసం ప్రతిపక్షాలకు ఆహ్వానం కూడా పంపలేదని గుర్తు చేశారు. కానీ తాము ప్రతిపక్ష నాయకుడికి తగినంత గౌరవం ఇచ్చి ఆహ్వానిస్తే రాలేదని విమర్శించారు. మొన్నటివరకూ తన గేటు కూడా తాకనివ్వని ఎమ్మెల్యేలతో ఇప్పుడు సహపంక్తి భోజనాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.