Home Page SliderTelangana

ఐటీఐ ప్రాజెక్టుకు సీఎం రేవంత్‌రెడ్డి భూమిపూజ

తెలంగాణాలోని మల్లేపల్లిలో ఐటీఐ అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్‌ను త్వరలోనే ప్రారంభం కానుంది.ఈ నేపథ్యంలో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఐటీఐ ప్రాజెక్టుకు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి సీఎంతోపాటు మంత్రి శ్రీధర్‌బాబు,టాటా ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలు నిరుపయోగంగా మారాయన్నారు.ఐటీఐలో నేర్పించే నైపుణ్యాలతో ఉపయోగం లేదన్నారు. కాగా అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్‌లు నా ఆలోచన నుంచే వచ్చాయన్నారు. విద్యార్థులకు ఐటీఐ సర్టిఫికెట్ ఉంటే సరిపోదు.. సాంకేతిక నైపుణ్యం కూడా ఉండాలన్నారు.ఈ మేరకు టాటా సంస్థ సహకారంతో తెలంగాణాలోని 65 ఐటీఐలను ఐటీసీలుగా మారుస్తున్నామన్నారు.