తెలంగాణాలో సీఎం రేవంత్ గంజాయి మొక్క
సీఎం రేవంత్ రెడ్డి కల్లు తాగిన కోతిలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి,బీఆర్ ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ విమర్శించారు.మంగళవారం వరంగల్ పర్యటన సందర్భంగా మాజీ సీఎం కేసిఆర్ చేసిన వ్యాఖ్యలకు ఎర్రబెల్లి కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీకి దమ్ముంటే రా అంటూ కేసిఆర్ కి సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు ఎర్రబెల్లి ఘాటుగా స్పందించారు. కేసిఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ పరివారం తట్టుకుంటుందా అని ఎద్దేవా చేశారు. రేవంత్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని జోస్యం చెప్పారు.సొంత పార్టీ ఎమ్మెల్యేలు,మంత్రులే రేవంత్ ని పట్టించుకోవడం లేదన్నారు. రాహుల్ గాందీ,సోనియా గాంధీ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని చెప్పారు. మరో వైపు ఎమ్మెల్సీ మధుసూదనా చారి,మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణయ్య కూడా రేవంత్ వరంగల్ పర్యటనపై ఘాటుగా స్పందించారు.
MORE UPDATES : 71రోజుల్లో 84 కాల్స్ ఉంటే అరెస్ట్ చేస్తారా?

