Home Page SliderTelangana

టీ20 ఛాంపియన్ సిరాజ్‌కు సీఎం రేవంత్ అభినందనలు

టీ20 వరల్డ్ కప్ టీమ్ ఛాంపియన్ సిరాజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసారు. టీమ్ ఇండియా జెర్సీని ఆయనకు బహుకరించారు. క్రికెటర్ సిరాజ్‌ను ప్రపంచకప్ సాధించినందుకు సీఎం అభినందించారు. పోచంపల్లి శాలువా కప్పి సత్కరించారు. ఈ భేటీలో మాజీ టీమిండియా కెప్టెన్, కాంగ్రెస్ నేత అజరుద్దీన్ కూడా పాల్గొన్నారు. ఇంకా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ప్రపంచకప్ గెలిచి వచ్చిన టీమ్‌లో సిరాజ్ కూడా ఉన్నారు. హైదరాబాద్‌ వాస్తవ్యుడైన సిరాజ్‌కు క్రికెట్ బోర్డు, అభిమానులు హైదరాబాద్‌లో భారీ ఊరేగింపు ఏర్పాటు చేస్తూ ఘనస్వాగతం పలికారు. ఓపెన్ టాప్ వాహనంపై పాట పాడి అభిమానులను ఉత్సాహ పరిచారు సిరాజ్.