తెలంగాణ స్విమ్మర్ టీఎస్ తేజస్‌ను అభినందించిన CM రేవంత్
జాతీయ స్థాయిలో పతకం సాధించిన తెలంగాణ యువ స్విమ్మర్ టీఎస్ తేజస్ కుమార్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న 40వ సబ్-జూనియర్, 50వ జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్ (National Aquatic Championship) పోటీల్లో తెలంగాణ బిడ్డ తేజస్ 100 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్‌లో కాంస్య పతకం గెలుచుకున్నారు.
స్విమ్మర్ తేజస్ కుమార్ మెడల్ సాధించడం తెలంగాణకు గర్వకారణమని ముఖ్యమంత్రి ఒక సందేశంలో పేర్కొన్నారు. ఈ యువ క్రీడాకారుడు భవిష్యత్‌లోనూ రాణించి, రాష్ట్రానికి, దేశానికి మరిన్ని విజయాలను సాధించేలా తెలంగాణ ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.