Home Page SliderTelangana

సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ, ఇతర మంత్రుల ఖరారు..నేడు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం

తెలంగాణాలో పదేళ్ల అనంతరం అధికారం చేపట్టబోతున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నేడు ప్రమాణ స్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయనతో పాటు మరి కొందరు మంత్రులను అధిష్టానం నిర్ణయించిది. డిప్యూటీ సీఎం సహా ముఖ్య శాఖలను సీనియర్లకు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్కతో పాటు మరి కొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరిద్దరితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, సుదర్శన్ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట రెడ్డి, దామోదర రాజనర్సింహలు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు మంత్రుల జాబితాను రాజ్ భవన్‌కు అందజేశారు కాంగ్రెస్ నేతలు. అయితే వీరి శాఖలు ఇంకా ప్రకటించలేదు. అధిష్టానం ఎంపిక చేసిన ఈ నేతలందరికీ సీఎం రేవంత్ రెడ్డే స్వయంగా ఫోన్లు చేసి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా హాజరు కానున్నారు. ఇప్పటికే వీరు శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు.