ఇందిర సౌర గిరి జల వికాసం పథకం ప్రారంభించిన సీఎం
ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూరు ఐటీడీఏ పరిధిలోని అమ్రాబాద్ మండలం మాచారంలో పథకాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టం కింద 6.69 లక్షల ఎకరాల విస్తీర్ణానికి దాదపు 2.30 లక్షల మంది ఎస్టీ రైతులకు పోడుపట్టాలు రేవంత్ రెడ్డి మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యేలు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

