Home Page SliderTelanganatelangana,

వేములవాడలో సీఎం..పలు కార్యక్రమాలకు శ్రీకారం..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖ శివక్షేత్రం వేములవాడలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, పొంగులేటి తదితరులతో కలిసి వేములవాడ రాజరాజేశ్వరస్వామి దర్శనం చేసుకుని, ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. రాష్ట్రప్రభుత్వం చేపట్టే రూ.127.65 కోట్ల అభివృద్ధి పనులకు ఆలయ సమీపంలో సీఎం భూమిపూజ చేశారు. అనంతరం గుడి వద్ద చెరువులో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు.