Home Page SliderTelangana

రాష్ట్ర వెనుకబాటుకు సీఎం కేసీఆర్ కుటుంబమే కారణం..

నిజామాబాద్: తెలంగాణకు పదేళ్లుగా గ్రహణం పట్టిందని.. రాష్ట్రం వెనుకబాటుకు కేసీఆర్ కుటుంబమే కారణమని.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, భూకుంభకోణాలపై విచారణ జరిపించి దోషులను శిక్షిస్తామని చెప్పారు. రైతులకు శక్తి ఇచ్చేందుకు, ఉద్యోగులకు ఉపాధి, మహిళల సాధికారతకు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు తప్పనిసరన్నారు. కేసీఆర్ కాళేశ్వరాన్ని ఏటీఎం లాగా మార్చుకున్నారని.. ప్రాజెక్టు వ్యయం రూ.32 వేల కోట్ల నుంచి 1.20 లక్షల కోట్లకు పెంచారని ఆరోపించారు. గురువారం నిజామాబాద్, సంగారెడ్డి బీజేపీ నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభల్లో నడ్డా ప్రసంగించారు. మిగులు రాష్ట్రమైన తెలంగాణను అవినీతి, అసమర్థ పాలనతో వెనుకబడేలా చేశారని విమర్శించారు. ధరణి భూములను హరించేదిగా తయారైందన్నారు. వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తిని సీఎం చేస్తామని ప్రధానే స్వయంగా చెప్పారని ఆ విషయం గుర్తుంచుకోవాలని నడ్డా అన్నారు.