సీఎం కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు
నెలవంక దర్శనం అనంతరం శుక్రవారం నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుండడంతో రాష్ట్ర, దేశ వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులందరికీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్రమైన రంజాన్ మాసం క్రమశిక్షణ, ధార్మిక ఆలోచనలను పెంపొందిస్తుందని, ఆదర్శవంతమైన జీవితానికి స్ఫూర్తినిస్తుందని సీఎం అన్నారు. పవిత్ర మాసంలో ఖురాన్ పఠనం, ప్రార్థనలు, ఉపవాసాలు, జకాత్, ఫిత్రా వంటి ధార్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మికతతో క్రమశిక్షణ అలవడుతుందని అన్నారు. ఖురాన్ పఠనం జీవితం అంతిమ అర్థాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని… పవిత్ర మాసం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కేసీఆర్ ఆకాంక్షించారు.


