Home Page SliderTelangana

పార్టీల చరిత్రను బేస్ చేసుకుని ఓటు వేయమన్న సీఎం కేసీఆర్

మంచిర్యాల: ఐదేళ్ల భవిష్యత్తు బాగుండాలంటే ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంచిర్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థుల గుణగణాలు, పార్టీల చరిత్రను బేస్ చేసుకుని ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. ప్రజల చేతుల్లో ఉన్న ఏకైక వజ్రాయుధం ఓటు అని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు ఉండేవి. గోదావరి ఒడ్డున ఉన్న ప్రాంతాలకూ కాంగ్రెస్ నీళ్లు ఇవ్వలేకపోయింది. ధరణి తీసేస్తే రైతుబంధు డబ్బులు ఎలా వస్తాయి? ధరణి వల్ల అర్ధగంట లోపు రిజిస్ట్రేషన్లు పూర్తవుతున్నాయి. తెలంగాణ సాధన కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని కేసీఆర్ స్పష్టం చేశారు.