Home Page SliderTelangana

భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష

తెలంగాణాలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలంగాణాలోని వాగులు,వంకలు పొంగి పొర్లి..వరదలు ముంచెత్తాయి. కాగా ఈ భారీ వర్షాలకు తెలంగాణా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే దీనిపై సీఎం కేసీఆర్ ఇవాళ సెక్రటేరియట్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రాష్ట్రంలో వర్షాలు,వరద పరిస్థితులపై తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణా సచివాలయంలో సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు. రాష్ట్రంలో కురుస్తున్న ఈ భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కాగా జనజీవనం స్తంభించింది. మరో వైపు ఈ భారీ వర్షాలకు ప్రాజెక్టులన్నీ వరద నీటితో పోటెత్తాయి.