Home Page SliderTelangana

ప్రొఫెసర్ హరగోపాల్‌పై ఉపా కేసు ఎత్తివేయడంటూ సీఎం కేసీఅర్ ఆదేశం

2019లో హరగోపాల్‌తో పాటు మరో 152 మందిపై తాడ్వాయ్ పోలీస్ స్టేషన్‌లో ఉపా కేసు నమోదయ్యింది. ఈ కేసు చాలా లేటుగా వెలుగులోకి వచ్చింది. అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (UAPA) ఉపా చట్టం అనేది చాలా దుర్మార్గమైన చట్టమని, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమని హరగోపాల్ గతంలోనే వ్యాఖ్యానించారు. ఇది పౌరహక్కులకు భంగం కలిగించే చట్టం అంటూ మండిపడ్డారు. ప్రభుత్వానికి ఈ చట్టం గురించి తెలిసి ఉండక పోవచ్చన్నారు. ఇలాంటి కేసులను కోర్టు కొట్టేస్తోందన్నారు. ఈ చట్టప్రకారం ఎలాంటి విచారణ లేకుండా ఎవ్వరినైనా అరెస్టు చెయ్యొచ్చని, ఇది చాలా దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ యాక్ట్ కింద బెయిల్ కూడా మంజూరు కాదు. కేసు తప్పని తెలిసినా నష్టపరిహారం కూడా ఇవ్వరు. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, పౌరహక్కుల సంఘాలు ఆందోళన చేయడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రొఫెసర్ హరగోపాల్‌తో పాటు మరికొంత మందిపై కేసును తొలగించమని, వారిని విడుదల చేయమని తెలంగాణా డీజీపీకి ఆదేశించారు.