Home Page SliderTelangana

తెలంగాణా ప్రజలకు ఏం కావాలో సీఎం కేసీఆర్‌కు తెలుసు:హరీశ్ రావు

తెలంగాణా మంత్రి హరీశ్‌రావు సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణాలో కాంగ్రెస్ హయాంలో వారంలో రెండు రోజులు కూడా ఉండేది కాదన్నారు. అంతేకాకుండా హైదరాబాద్-పటాన్‌చెరులో పవర్ హాలీడే ఉండేదని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో 24 గంటలు కరెంటు ఉంటోందన్నారు. దీంతో తెలంగాణాలోని కార్మికులకు నిరంతరం పని లభిస్తోందని తెలిపారు. అయితే ఎవరికి ఏం కావాలో తెలిసిన నాయకుడు మన కేసీఆర్ అని హరీశ్‌రావు కొనియాడారు. ఇక పటాన్‌చెరులో ఏడాదిలోపు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు.