Home Page SliderTelangana

సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదివారం ఉదయం గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ)లో కడుపులో అసౌకర్యం ఏర్పడడంతో ఆయనను పరీక్షించారని ఏఐజీ హాస్పిటల్స్ గ్యాస్ట్రోఎంటరాలజీ చైర్మన్, చైర్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్‌కు ఆదివారం ఉదయం కడుపులో అసౌకర్యం కలగడంతో డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి పరీక్షించారు. ఏఐజీ హాస్పిటల్స్‌లో ఎండోస్కోపీ చేశారు. కడుపులో అల్సర్‌కు చికిత్స అందించారు. సీఎంకు ఇతర ఏ ఇబ్బందులు లేవని వైద్య పరీక్షల్లో తేలింది.