ఇచ్చిన హామీ ఐదేళ్లయినా నెరవేర్చని సీఎం కేసీఆర్
గత ఎన్నికల సమయంలో పరిగికి వచ్చిన సీఎం కేసీఆర్ ఇక్కడే కూర్చుని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ఆ హామీ ఏమైందని పరిగి బీజేపీ అభ్యర్థి మారుతీకిరణ్ అడిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహమ్మదాబాద్ మండలం గాధిర్యాల్ గ్రామంలో మాట్లాడారు. అన్ని రంగాల్లో వెనుకబడిన పరిగిని అభివృద్ధి చేస్తామని ఇందుకోసం ఒక్క అవకాశం తమకు ఇవ్వాలని మారుతీకిరణ్ కోరారు. బుధవారం నియోజకవర్గంలోని మహమ్మదాబాద్ మండలం చౌదర్‌పల్లిలో జరిగిన ప్రచారంలో పాల్గొని మాట్లాడారు.