NewsTelangana

ప్రగతి భవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ 8 రోజులపాటు ఢిల్లీలో పర్యటించారు. కేసీఆర్ ఢిల్లీలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణ పనులు పర్యవేక్షించారు. నూతన కార్యాలయాన్ని వేగంగా నిర్మించాలని… పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పార్టీ ముఖ్యులకు సూచించారు. నిర్మాణ పనులతోపాటు, ఢిల్లీలో సీనియర్ రాజకీయ విశ్లేషకులతోనూ చర్చలు జరిపారు. మునుగోడు ఉపఎన్నికలు దగ్గర పడుతుండటంతో.. ఇకపై పూర్తి కాన్సన్‌ట్రేషన్ పెట్టనున్నట్టు తెలుస్తోంది. మునుగోడు ఎన్నికల ప్రచారానికి త్వరలో కేసీఆర్ హాజరవుతారని సమాచారం.