Andhra PradeshHome Page Slider

మూడు జిల్లాల్లో సీఎం జగన్ రెండ్రోజుల పర్యటన

•నేడు ప్రకాశం జిల్లా కు సీఎం జగన్ రాక
•వైసీపీ నేత అశోక్ బాబు తల్లికి నివాళి
•సాయంత్రం గవర్నర్ తో భేటీ
••రేపు విశాఖలో జీ20 ప్రతినిధులతో సమావేశం

ఏపీ సీఎం జగన్ రెండ్రోజుల పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. ఇవాళ, రేపు ప్రకాశం, విజయవాడ, విశాఖలో పర్యటించనున్నారు. ఈ ఉదయం 10.55 గంటలకు ప్రకాశం జిల్లా కారుమంచి వెళ్లనున్నారు. వైసీపీ నేత అశోక్ బాబు తల్లి కోటమ్మకు నివాళులు అర్పించనున్నారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు. సీఎం జగన్ రేపు సాయంత్రం 6 గంటలకు విశాఖ వెళ్లనున్నారు. రుషికొండలోని రాడిసన్ బ్లూ రిసార్ట్స్ చేరుకోనున్నారు. రేపు రాత్రి 7 గంటలకు జీ20 ప్రతినిధులతో సమావేశం కానున్నారు. జీ20 ప్రతినిధులకు ఏర్పాటు చేసిన విందులో సీఎం పాల్గొంటారు. అనంతరం, రేపు రాత్రి 10 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.